చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చిన్నారి స్థానిక సర్కారు స్కూల్ లో చదువుతోంది . ఆదివారం సెలవు దినం కావడంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు . ఇదే క్రమంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని అదే గ్రామానికి చెందిన వరుసకు అన్న అయిన ఎడ్ల శ్రీనివాస్ ( 19 ) ప్రేమగా పిలిచనట్లు నటించాడు . ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు . తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి చిన్నారి ఏడుస్తుండగా, తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీశారు . ఆమె ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది . వరుసకు చెల్లెలైన పసిపాపపై ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డావంటూ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు . అనంతరం చిల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . సోమవారం ఏసీపీ వెంకటేశ్వర బాబు , సీఐ రాజిరెడ్డి , ఎస్సై శ్రీనివాస్ రాజవరం కేసు నమోదు చేశారు . చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం తరలించారు . శ్రీనివాస్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం . ఉన్నతాధికారుల ఆదేశాను సారంగా స్టేషన్ ఘన్పూర్ , హన్మకొండ పోలీస్ లు యువకుడిని విచారిస్తున్నట్లు తెలిసింది..