పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్స్ తొలగించి నడుపుతున్న 50 వాహనాలను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం అయినది. నెంబర్ ప్లేట్స్ తీసుకొని వచ్చిన తర్వాత వారికి జరిమానా విధించి మరొకసారి నెంబర్ ప్లేట్స్ తొలగించినచో చట్టరీత్యా చర్య తీసుకోబడుతుందని హెచ్చరించి వాహనాలను రిలీజ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐ లు రామారావు, రాజబాబు, దేవేందర్, శ్రవణ్, వేణు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.