ఇకపై వాహనదారులు నిర్ణీత వాహన వేగం హద్దు మీరి వాహనం నడిపితే జరిమానా తప్పడని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ విభాగం నూతనంగా ప్రవేశపెట్టిన స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ను శుక్రవారం ప్రారంభించారు.

రోజు రోజుకి వాహనాల సంఖ్య ఘణనీయంగా పెరిగిపోవడంతో పాటు అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాల సంఖల్య పెరిగిపోతుండంతో, రోడ్డు ప్రమాదాలను నివారణకై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక చర్యలు గైకోనడం జరుగుతోంది. ఇందులో భాగంగా మీతిమీరిన వేగంతో వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారణకై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో స్పీడ్‌ గన్స్‌ ప్రవేశ పేట్టడం జరిగింది. ఈ సందర్బంగా వరంగల్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ విభాగం అధ్వర్యంలో కాజీపేటలోని నిట్‌ కళాశాల ప్రాంతంలో తోలిసారిగా స్పీడ్‌ గన్స్‌ పరీక్షను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రారంభించారు.

ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రోడ్డు ప్రమాదాల చాలా మంది చనిపోవడం జరుగుతోందని. ఇందుకు కారణం వాహనాలను మీతిమీరిన వేగంతోనే నడపడం ద్వారానే జరగటాన్ని గుర్తించడం జరిగింది. వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తునే ట్రాఫిక్‌ నిబంధంనలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయని. ఇందులో భాగంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇందులో ఒకటి సెంట్రల్‌ జోన్‌ మరో రెండు స్పీడ్‌లేజర్‌ గన్స్‌ వెస్ట్‌ మరియుఈస్ట్‌ జోన్ల పరిధిలో వినియోగించబడుతాయని.

ఈ స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా హైవేలపై 80కి మరియు నగరంలో 30కి మించి వేగంగా పోయే వాహనాలను గుర్తించి వాటి సమాచారాన్ని ఈ ఛాలాన్‌ సర్వర్‌కుకు అనుసంధానం చేయడంతో పాటు అదే సమయంలో వాహనాన్ని వేగంగా నడిపినందుకుగాను జరిమానా విధిస్తున్నట్లుగా వాహనదారుడు సెల్‌నెంబర్‌కు సంక్షిప్త సమాచార రూపంలో ఎస్‌.ఎం.ఎస్‌ రావడం జరుగుతుందని. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆరున్నర లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరగడంతో పాటు ప్రతి సంవత్సరం 30వేలకు పైగా కోత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని. ఇలా వాహనాలు పెరిగిపోవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతాయని, కాబట్టి ప్రతిఒక్కరు ఈ ట్రాఫిక్‌ నియమాలను పాటించనట్లయితే ఈ ప్రమాదాలను నివారించగలమని. వేగం అతిప్రమాదకరం కాబట్టి వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు పాటించి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలను కోరారు.