వరంగల్ సిక్కిరెడ్డి, అర్జున అవార్డు గ్రహీత కి ఘనస్వాగతం

అర్జున అవార్డు గ్రహీత, బ్యాట్మంటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి మహబూబాబాద్ సందర్శించారు. ఈ సందర్భంగా తొర్రూర్ మండ‌ల కేంద్రంలో సిక్కిరెడ్డిని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ఘనస్వాగతం పలికారు. న‌ర్సింహుల‌పేట‌లో డోర్నక‌ల్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయ‌క్‌, చిన్న గూడూర్ మండ‌ల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వ‌ల్లూరి కృష్ణారెడ్డి త‌దిత‌రులు ఆమెను ఘ‌నంగా స‌త్కరించారు. ఈ సంద‌ర్భంగా సిక్కిరెడ్డిని చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.

ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు.