సివిల్ పంచాయతీల్లో తల దూరిస్తే కఠిన చర్యలు : కమిషనర్ డాక్టర్ వి. రవీందర్….
Advertisement
వరంగల్ కమిషనరేట్‌లో పోలీసు నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. అందులో మాట్లాడిన వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి. రవీందర్ భూకబ్జాదారులు, రౌడీషీటర్లు సివిల్ పంచాయతీలలో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల నమోదు, విచారణ, నిందితుల అరెస్టు, ఇతర విషయాలపై అధికారులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. పదే పదే నేరాలు చేసేవారిపై అవసరమైతే పీడీ యాక్టు తేవాలని కోరారు.