వరంగల్ సెంట్రల్ జైలుకు ప్రణయ్ హంతకుడు మారుతీరావు
మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన తిరునగరి మారుతీరావు, అబ్దుల్ కరీం, తిరునగరి శ్రవణ్ కుమార్‌లను మిర్యాలగూడ నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులైన ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. వారిని వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఏడాది పాటు వీరు ముగ్గురూ సెంట్రల్ జైల్లో ఉంటారని,
Advertisement
ముగ్గురికి వేర్వేలు బ్యారక్‌లు కేటాయించామని డీఐజీ మురళీబాబు తెలిపారు. ఈ కేసులో ఏ1గా మారుతీ రావు, ఏ5గా కరీం, ఏ6గా శ్రవణ్ ఉన్నారు.