సుబేదారి పరిధిలో మరో రెండు పి.డీ యాక్ట్ కేసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న రాజస్తాన్ రాష్ట్రం ఆజ్మీర్ జిల్లాకు చెందిన రతన్ , జగదీష్ లపై వరంగల్ పోలీస్ కమిషనర్ అదివారం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులను సుబేదారి ఇన్స్‌పెక్టర్ సదయ్య వరంగల్ కారాగారంలో వున్న నిందితులకు జైలర్ సమక్షంలో పీడీ యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు ఉత్తర్వులను అందజేసారు.

పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు గత డిసెంబర్ మాసంలో సుబేదారిలో పరిధిలో చోరీలకు పాల్పడటంతో నిందితులను గత సంవత్సరం డిసెంబర్ 5వ తేదిన అరెస్ట్ చేసి వారి నుండి సుమారు. 15 లక్షల రూపాయల విలువగల 488 గ్రాముల బంగారు మరియు 730 గ్రాముల వెండి అభరణాలను పొిలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు మరో నలుగురు నిందితులతో కల్సి రాజస్థాన్ రాష్ట్రం నుండి వచ్చి వరంగల్, హన్మకొండ , కాజీపేట, సుబేదారి ప్రాంతాల్లో బొమ్మ బెలూన్లు అమ్ముకోంటూ తాళం వేసి వున్న ఇండ్లను గుర్తించి అవకాశం దొరికినప్పుడు నిందితులు తాళం వేసి వున్న ఇండ్ల లో చోరీలకు పాల్పడేవారు. ఈ తరహలోనే నిందితులు వరంగల్ పొిలీస్ కమిషనరేట్ పరిధిలో పది చొరీలకు పాల్పడగా ఇందులో అత్యధికంగా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 , కేయూ పరిధిలో రెండు అలాగే మట్వాడా, ఇంతేజార్ గంజ్, రాయపర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీలకు పాల్పడ్డారు.

నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం పోలీసుల భాధ్యత. ఇందులో భాగంగా ప్రజల ఆస్తుల చోరీలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని. ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.