హనుమకొండ: 55వ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సరస్వతి పూజ హోమము కార్యక్రమం మరియు జిల్లా గ్రంథాలయంలో మధ్యాహ్నం నగరంలోని ప్రముఖ కవులచే కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్ష్యత వహించిన గ్రంథాలయ చైర్మన్ శ్రీ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ: కవులకు, కళాకారులకు పుట్టినిల్లు మన ఓరుగల్లు, కవులు వారి రచనల ద్వారా భావాల్ని స్పష్టంగా వ్యక్తీకరిస్తారని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తామని అన్నారు. మహ్మద్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన 20 మంది ప్రముఖ కవులు వారి కవితాలను వినిపించారు. వినిపించిన కవితలు ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి పద్మజ, లైబ్రరియన్ కరుణ కుమారి, సామజిక వేత్తలు నిమ్మల శ్రీనివాస్, సాగంటి మంజులతో పాటు ఎం.వి. ఎం.చారి, వల్స పైడి, గుల్షన్, సయ్యద్ అక్బర్, నిఖిల్, రాజేష్, శివ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న కవులందరికి ప్రశంసా పత్రాలు అందించి ఘనంగా సత్కరించారు..