వరంగల్‌లో ఓ మహిళ హల్‌చల్ చేసింది. స్నేహితులతో ఆడుకుంటున్న ఆరేళ్ల పిల్లాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో పిల్లాడు ఏడుస్తుండటంతో స్థానికులు గమనించి మహిళను అడ్డుకున్నారు. పిల్లాన్ని ఆ మహిళ నుంచి రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను బుజ్జగించి, బతిమాలి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ మహిళకు మతిస్థిమితం లేదంటా కానీ స్థానికులు చెప్తోంది మాత్రం వేరే, వివరాలు: వరంగల్‌లో మతిస్థిమితం సరిగాలేని ఓ మహిళ కలకలం సృష్టించింది. డాక్టర్స్ కాలనీలో 6ఏళ్ళ బాలుడు హేమంత్ కుమార్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే స్థానికులు గమనించి వెంటనే ఆమెను పట్టుకుని బాలుడిని విడిపించారు. మతిస్థిమితం లేని మహిళను పోలీసులకు అప్పగించారు. పిల్లలంతా ఆడుకుంటుండగా సదరు మహిళా అటు వైపు వెళ్లడంతో పిల్లలు రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశారు.

దీంతో ఆ మహిళా హేమంత్ కుమార్‌ను పట్టుకుని చెవులు పిండి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. స్థానికులు గమనించి మహిళను బెదిరించి బాబును విడిపించారు. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా తిరగబడింది. చివరకు మీ ఇంటి వద్ద వదిలేస్తామని నచ్చజెప్పి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిందని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆరోపించారు. ఆ మహిళ కావాలనే మతిస్థిమితం లేనట్టుగా నటిస్తోందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మహిళకు నిజంగానే మతిస్థిమితం లేదా లేకపోతే నటిస్తోందా అన్నది తెలియాల్సి ఉంది.