{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579027937237","total_editor_time":91,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579027937199","total_effects_time":0,"brushes_used":0,"height":756,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}

దేవుడు వరం ఇచ్చాడేమో అన్నట్టుగా ఏటీఎంలో ఎంటర్‌ చేసిన అమౌంట్‌కన్నా ఎక్కువగా డబ్బులొస్తే ఎవరికైనా ఇంకేం కావాలి. ఇలాంటి ఘటన వరంగల్ జిల్లా కమలాపూర్‌లో జరిగింది.

బస్టాండ్ సమీపంలోని ఇండియన్ వన్‌ ఏటీఎం మిషన్‌ నుంచి వెయ్యి తీసుకుందామనుకునే వాళ్లకు 6 నుంచి 10 వేలు వచ్చిపడ్డాయి. మేటర్‌ మౌత్ పబ్లిసిటీ కావడంతో అందరూ ఎగబడి ఏటీఎం ఖాళీ చేశారు. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లగా.. ఏటీఎం రిపేర్‌ చేసేవాళ్లను తీసుకొచ్చారు.

ఏటీఎం లో ఉన్న 2 వందలు, 5 వందల నోట్లన్నీ ఖాళీ అయ్యాయి. మిషన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్‌ వల్లే డబ్బులు ఎక్కువగా బయటికి వచ్చాయని రిపేర్‌ చేసినవాళ్లు చెప్పారు. మొత్తానికి అలా ఏటీఎం కరుణించడంతో మెషిన్‌లో ఉన్న 8 లక్షలు జనం జేబులో వేసుకున్నారు. అంతా అయ్యాక.. కొందరు తమ లక్‌ కూడా ట్రై చేద్దామని వచ్చి నిరాశకు గురయ్యారు.