వరంగల్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూలై నెలలో వరంగల్‌కు రానున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) వజ్రోత్సవాల సందర్భంగా ఆయన ఇక్కడికి రానున్నట్టు కేఎంసీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న కేఎంసీ వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని, దేశం గర్వపడేలా కార్యక్రమాల రూపకల్పన ఉండాలని భావించిన అధికారులు ఈ మేరకు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతిని ఆహ్వానించినట్టు తెలిసింది.

ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి అంగీకరించినట్టు సమాచారం.