పేరు గొప్ప ఊరు దిబ్బ
రోగులు ఎంజీఎం లో, పరీక్షలు ప్రైవేటు లో..
మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఎంజీఎంలో గత కొద్దిరోజుల నుంచి ఎంజీఎం ఆస్పత్రిలో లకు సంబంధించిన వైద్య పరికరాలు మూలన పడడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి ఎంజీఎం ఆస్పత్రికి వైద్యం కోసం రోగులు ప్రజలు నిత్యం ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి ని ఆశ్రయిస్తారు. ఎంజీఎం ఆస్పత్రిలో ల్యాబ్ లు ఉన్నా వాటిలో వైద్య పరికరాలు మూలన పడడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఎంజీఎం కు ఎదురుగా ఉన్న ప్రైవేట్ లేకుండా ఆశ్రయిస్తున్నారు.
- ప్రభుత్వం నుంచి ఎంజీఎం ఆస్పత్రికి వేలాది కోట్ల రూపాయలు వస్తున్న ల్యాబ్ లో పరికరాలు అందుబాటులో ఉండక పోవడంతో ఆంతర్యం ఏమని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. రోగులు ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లే పరిస్థితి ఉండకుండా ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
- ఎంజీఎం ఆస్పత్రికి రోజుకు జనరల్ ఓపి విభాగం నుంచి సుమారు 500 మంది వరకు వస్తుంటారని, అత్యవసర విభాగానికి ఇన్పేషెంట్లు రోగులు 900 మంది ఎన్నో నిత్యం ఉంటారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం వైద్యులు ఇష్టారాజ్యంగా ప్రైవేటుకు రిఫర్ చేయడం తో పేద ప్రజలు డబ్బులు చెల్లించి పరీక్షలు చేసుకోలేక వైద్యం చేయించుకోలేక ఇంటిముఖం పడుతున్నారు.