వరంగల్ ఎన్‌ఐటీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్ హాస్టల్‌లోని తన గదిలో విద్యార్థి ఉరేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన కౌశిక్‌పాండేగా పోలీసులు గుర్తించారు. కౌశిక్‌పాండే బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.