కార్యకర్తలే శ్రీరామరక్ష , వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం

తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం బాపూజీనగర్ లో పట్టణ ఉమ్మడి డివిజన్ల టిఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా టిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నా పలువురు యువత తిరిగి పార్టీలో చేరారు, వీరికి దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దాస్యం కుటుంబానికి రాజకీయ పునాదిగా కాజీపేట పట్టణం నిలిచిందన్నారు ఉద్యమకాలంలో పట్టణానికి చెందిన అనేక మంది పై కేసులు నమోదయ్యాయి అని చెప్పారు.

కాజీపేట ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఫాతిమా వద్ద సమాంతర బ్రిడ్జిని మంజూరు చేయించానని ఐటిఐ రెఫరల్ దావకాన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాజీపేట జంక్షన్ కు మంజూరైన వ్యాగన్ షెడ్డు కు భూసేకరణ పూర్తయిందని త్వరలోనే షెడ్డు కు శంకుస్థాపన ఉంటుందన్నారు నియోజకవర్గంలో దాదాపు 23 వేల మంద టిఆర్ఎస్ి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారని చెప్పారు.