NRI మహిళ కు అత్తింటి శారీరక , మానసికంగా వేధింపులు

అత్తింటి వారు డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఓ ఎన్నారై మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణగూడలోని బాలల హక్కుల సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు కవిత మాట్లాడారు. రహ్మత్‌నగర్‌కు చెందిన గుండా రాకేశ్‌కుమార్‌తో 2003లో వివాహమైందని, ఉద్యోగరిత్యా ఇద్దరం యూకేలో స్థిరపడ్డామన్నారు. ఏడాదిన్నర క్రితం నగరానికి రాగా అత్తామామలు, మరిది కలిసి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారని వివరించారు. కాదన్నందుకు ఇంట్లోంచి గెంటివేశారని ఆరోపించారు. గత్యంతరం లేక పుట్టింటికి వరంగల్ కు వెళ్తే భర్తను మత్తుకు బానిస చేశారని ఆవేదన చెందారు. రెండు రోజుల క్రితం మెట్టినింటికి వెళ్తే ఇంట్లోకి వెళ్లకుండా తిట్టి, దాడి చేశారని తెలిపారు.

జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.