లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో 16 గెలుస్తామని ధీమా ఉన్నా 9 స్థానాలకే పరిమితమైంది టీఆర్ఎస్అయితే, ఈ ఎన్నికల ఫలితాలతో తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఫెయిల్ కాలేదన్నారు కేటీఆర్, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్‌కు సెట్ బ్యాక్ కాదని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో సింహ భాగం టీఆర్ఎస్‌కే అనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, తెలంగాణ ప్రజలు లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 40 శాతం ఓట్లు మెజార్టీ సీట్లు ఇచ్చారన్నారు. ఇక చంద్రబాబు పరాభవాన్ని తాము ముందే చెప్పామన్న కేటీఆర్, ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంతంగా గెలిచారు, పాదయాత్రతో ప్రజల్లో ఉన్నారని వెల్లడించారు. ఏపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.