తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో గండ్ర దంపతులు భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు గండ్ర ప్రకటించారు.

తెలంగాణను నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు గండ్ర వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు చెప్పారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తిచేసేందుకే వీడుతున్నట్టు స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ ద్వారా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. త్వరలోనే తెరాసలో చేరనున్నట్టు వెల్లడించారు.