వస్తావా ! వస్తే 30 కోట్లు! …………………………………మంత్రిత్వం

కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ కమలం బద్దలైంది. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర బట్టబయలయింది , పార్టీ మారితే కోట్లుకుమ్మరిస్తామని నేతలు ప్రలోభాలు మొదలుపెట్టారు. దీంతో కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది.
పార్టీ ఫిరాయించి కమలదళంలో చేరితే మంత్రి పదవితో పాటు రూ.30 కోట్ల నగదు ఇస్తామని భాజపా నాయకుల నుంచి ఆఫర్‌ వచ్చినట్లు కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.

ఆమె ఇక్కడ బెళగావిలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారుg. భాజపా నాయకులు తనకు చేసిన ఫోన్‌లోని సంభాషణల్ని రికార్డు చేసి పార్టీ నాయకులకు చూపినట్లు తెలిపారు. ‘ఆపరేషన్‌ కమలం’ గురించి నాయకులకు వివరించానన్నారు. P

s కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ భద్రతకు ఎలాంటి ఢోకాలేదన్నారు. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందన్నారు.