వాగ్దేవి కళాశాలకు ప్రతిష్టాత్మక పురస్కారం

బొల్లికుంట వాగ్గేవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (అటానమస్)కు ప్రతిష్టాత్మక ఐసీటీ అకాడమీ గ్రోత్ అవార్డు లభించింది. హైదరాబాద్ బ్రిడ్జ్ కాన్ఫరెన్స్-2018లో \జరిగిన సదస్సులో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి సహ్రపబుద్దే చేతుల ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 కళాశాలల నిపుణులు పరిశీలించి మూడు కళా శాలలను అవార్డుకు ఎంపిక చేశారు. అందులో భాగంగానే వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కు ఈ అవార్డు దక్కింది. కళాశాలలోని పా రిశ్రామిక అనుసంధాన విభాగం అధ్వర్యంలో విద్యార్థులు, ఆధ్యాప కుల నైపుణ్యాల అభివృద్ధితోపాటు వివిధ అంశాలపై ఇచ్చిన శిక్షణను దృష్టిలో ఉంచుకున్నట్లు విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల కల్పన,

అత్యుత్తమ విద్యా బోధనా అవార్డుకు కారణమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. ప్రకాష్ వివరించారు. కళాశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నెలకొల్పినందుకు ఈ అవార్డుకు ప్రధానకారణమని పేర్కొన్నారు.