వాట్సాప్ మెసేజ్ – స్పందించిన మన వరంగల్ కలెక్టర్ 30-12-2018

కాశిబుగ్గ ప్రాంతంలో 12 ఏళ్ల చిన్నారి వైన్స్ షాపుల చుట్టు పక్కల ప్రాంతంలో భిక్షాటన చేయడాన్ని చూసి చలించిపోయిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మేక అనిత కుమారి వెంటనే ఫోటోలు, వీడియో తీసి జిల్లా కలెక్టర్ హరితకు వాట్సప్ చేశారు. స్పందించిన క‌లెక్ట‌ర్ ఐసీపీసీ మహేందర్రెడ్డిని అక్క‌డికి పంపించారు. బాలిక‌ మానసిక పరిస్థితి బాగోకపోవడంతో హైదరాబాద్ లోని మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో చేర్పించారు.