వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి కటకటాల పాలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో జరిగింది.
వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు గ్రూప్ అడ్మిన్‌తో పాటూ, పోస్ట్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జొమాటోలో డెలివరీ బోయ్‌గా పని చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి లాయల్ పార్ట్‌నర్స్ ఎమర్జెన్సీ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఫిబ్రవరి 26న గ్రూప్ మెంబర్ మహమ్మద్ మునీర్ జాతీయ జెండా తగలబెడుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీనిపై అదే గ్రూప్ సభ్యుడైన వెంకట రామరెడ్డి మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు గ్రూపు అడ్మిన్ వెంకటేష్, మెసేజ్ పోస్ట్ చేసిన వ్యక్తి మహమ్మద్ మునీర్‌పై కేసు నమోదు చేశారు. రెండు వర్గాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సెక్షన్ 153ఏ కింద కేసు బుక్ చేసి రిమాండ్‌కు తరలించారు.