తన భర్త తనను శారీరకంగా, మానసికంగా బయటకు చెప్పుకోలేని విధంగా వేధిస్తున్నాడని భార్య గురువారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి: యువతికి గొల్లపూడిలో ఫైనాన్స్‌ వ్యాపారితో మూడు నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో రూ.6 లక్షలు కట్నం, బంగారం ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత వారం రోజులు కాపురం సజావుగా సాగింది. రాత్రి సమయంలో సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి స్నేహితుడికి చూపిస్తానని వేధిస్తున్నాడు. స్నేహితుల ముందు కూడా ఇలాగే చేయాలని బలవంతం చేస్తున్నాడు. చిన్నత్త కుమారుడితో కాపురం చేయాలంటూ అత్త బలవంతం చేస్తున్నట్లుగా ఆమె ఫిర్యాదులో తెలిపింది. వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై మధ్యవర్తుల జోక్యంతో గత నెల 29న గొల్లపూడిలో రెండు వర్గాల వారు సమావేశమయ్యారు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో బాధితురాలి తండ్రి, తమ్ముడిపై భర్త తరురపు బంధువులు దాడి చేశారు. దీనితో వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు భవానీపురం పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…