వాతావరణ సూచిక బోర్డులు ఏర్పాటు…..

వరంగల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ఉష్ణోగ్రతలు తెలిపే విధంగా రూపొందించిన ఎల్ఇడి బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బోర్డులు కలెక్టర్ ప్రశాంతి జీవన్ పటేల్ కలెక్టరేట్లో స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బోర్డులు జిల్లాలోని 16 ప్రాంతాల్లో నమోదైన వాతావరణ వివరాలు మాస్టర్ సర్వర్కు చేర్చి గంటకోసారి కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన బోర్డుపై ప్రదర్శిస్తాయి.