తనకు బ్రెయిన్ క్యాన్సర్ అని, చికిత్స చేయకుంటే ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకనని అబద్దాలు చెప్పి 2 లక్షల 75 వేల పౌండ్లు డబ్బు దండుకున్న జాస్మిన్ అనే భారతీయ సంతతి మహిళకు బ్రిటన్ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.. ఆమె భర్త విజయ్, భార్య మోసాన్ని బయటపెట్టి కేసు పెట్టాడు. తప్పుడు స్కానింగ్ రిపోర్టులు సృష్టించి, దొంగ సిమ్ కార్డుల ద్వారా తన మొబైల్ కు తానే డాక్టర్ ఇచ్చినట్టు మెసేజ్ ఇచ్చుకొని నాటకం ఆడింది.. బంధువులు, స్నేహితులు సానుభూతి సంపాదించి డబ్బులు వసూలు చేసింది.. అనుమానంతో భర్త విచారించగా భార్య చేసిన మోసం బయట పడింది.

దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది. ఈ రోజు కోర్టు ఆమెకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.