వామ్మో ! గీరోద్దేందీ…. గింతగనం పాడైంది… దీన్లో పడితే నడుములిరుగుడు గ్యారెంటీ అని అనుకుంటున్నారా ! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెయిన్ రోడ్లు బాగా దెబ్బ తిన్నాయి . ఇటీవల జోరుగా కురిసిన వర్షాలకు రోడ్లపై డాంబర్ కొట్టుకుపోయింది. చిన్న గుంతలు భారీ వాహనాల రాకపోకలకు పెద్దగయ్యాయి. దీంతో ప్రయాణం నరకంగా మారింది. వేగంగా వెళ్లిన వాహనదారులు ప్రమాదాల బారిన పడి హాస్పిటళ్ల పాలవుతున్నారు. ఒక గుంత రాగానే తప్పించేందుకు బండి స్లో చేసి, గేర్ మార్చి ముందుకెళ్లగానే మరొకటి వస్తోంది . ఈ క్రమంలో వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి . ఈ రోడ్ల మీద నుంచే కార్లలో తిరుగుతున్న ప్రజాప్రతినిధులు , ఆఫీసర్లు వెంటనే స్పందించి రిపేర్ చేయించాలని జనాలు కోరుతున్నారు .

సిటీ , పట్టణం అనే తేడా లేకుండా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రోడ్ల న్నీ వెక్కిరిస్తున్నాయి . బండ్లు నడిపేవాళ్లను అడుగడో గుంత ఆగ-మాగం చేస్తుంది. కొన్ని చోట్ల అరకిలో మీటర్ దూరం వెళ్లడానికి పావుగంట టైం పడుతోంది . దారుల్లో వెళ్తున్న జనం నడుములు విరుగుతున్నాయి. ప్రయాణికులు, హాస్పిటళ్లు , బైకులు , ఆటోలు, మెకానిక్ ల చుట్టూ తిరగాల్సి వస్తోంది . ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది . వానలు కురవడంతో రోడ్లమీద డంబార్ కొట్టుకుపోయింది, పెద్దపెద్ద గుంతలు పడి అందులో వరద చేరడంతో అవి చిన్న మడుగుల్లా కనిపిస్తున్నాయి. అందులోనుంచి పోయేటప్పుడు బురద పక్కన వెళ్లే వాళ్ళ మీద పడుతోంది . అది కాస్త ఇద్దరి మధ్య పంచాయతీకి కారణమవుతోంది . గ్రామాలకు వెళ్లే రోడ్ల పరిస్థతి ఇంకా దారుణం రోడ్డు మీదుండే కంకర కొట్టుకుపోయి పక్కనే ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయి . వాటికి మరమ్మతులు చేయాల్సిన ఆఫీసర్లే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు . దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . రోడ్లపై ఉన్న గుంతల వద్ద చేపలు పడుతూ కొందరు ,వరి నాట్లు వేస్తూ మరికొందరు నిరసనను వ్యక్తం చేస్తున్నారు . ఉన్నాతాధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు…