వారం రోజులపాటు తాగునీరు రాక ఇబ్బందులు

వారం రోజులుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో గ్రామస్థులు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలు పెట్టి తమ నిరసన తెలియజేసారు. అనంతరం మాట్లాడుతూ తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ, కొత్తబజారు కాలనీలకు గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందన్నారు.