చెడు ప్రచారం చేస్తున్న కార్యకర్తలకు సోషల్ మీడియాకు తెరాస కార్యకర్తల ఘాటు సమాధానం ..

హరీష్ రావు విషయంలో కేసీఆర్ గారి గురించి తప్పుగా మాట్లాడే వారు తెరాస నాయకులూ కాదు అని కార్యకర్తలు అంటున్నారు .. ఇవాళ మంత్రి పదవి ఇయ్యలేదు అనేవాళ్ళు రేపటి రోజు ఇంకోమంచి పొజిషన్ లో ఉంచితే ఎం సమాధానం చెబుతారు అని అడుగుతున్నారు .

అందరికీ మంత్రి పదవులుంటే కుటుంబ పాలన అంటిమి. అలా అని ఇయ్యకపోతే ఇయ్యలేదు అనవడితిమి. ఇదంతా కాదు గానీ ఇంత తెలిసిన మేధావులు ఆనాడు కేసీఆర్ గారి కంటే ముందే తెలంగాణ సాధించాలిసింది. ఆయన నాయకత్వంలో ఎందుకు పనిచేసినట్టు????

దేనికైనా కొంత సమయం ఉంటుంది, అనుకోగానే అన్ని అయిపోవు. కేసీఆర్ గారు దేశ రాజకీయాలలో మార్పు తేవాలనీ చూస్తుంటే, మనం మాత్రం ఇంకా ఈ స్థాయిలో ఉండే ఆలోచించవడితిమి. హరీష్ రావు గారు దేశ రాజకీయాలలో అడుగుపెట్టబోతున్నారు…

హరీష్ రావు గారు ఎక్కడ పదవి ఇవ్వలేదని భాదపడుతున్నట్టు చెప్పలేదు. అందుకే మనలో ( పార్టీలో ) ఉన్న కుహనా మేధావులను వ్యక్తిగత ఉద్దేశ్యంతో కాకుండా పార్టీ ప్రయోజనం కోసం మనమందరం పని చేస్తే ఇంకా ముందుకు పోవచ్చు. అభివృద్ధి సాధించవచ్చు. అని తెరాస కార్యకర్తలు చెప్పుకుంటున్నారు …