గీతారాణి (38)కి ఓ ఆర్మీ ఉద్యోగితో వివాహం జరిగింది, వీరికి ఇద్దరు ఆడపిల్లలు అయితే గీత భర్త ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రంలో ఉండడం చేత అదే ప్రాంతానికి చెందిన హమీద్‌ (36) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది . అయితే ఈ విషయం తెలుసుకున్నా గీతా భర్త మరియు హమీద్‌ భార్య తమ కుమారున్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు . దీనితో హమీద్‌ , గీతారాణి కలిసే ఉంటున్నారు . ఈ నేపధ్యంలో గీతాపై అనుమానం పెంచుకున్న హమీద్‌ ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమెను ఇంట్లో కత్తితో దాడి చేసి పారిపోయాడు దీనితో ఆమె కేకలు వేసుకుంటూ రక్తపు మడుగులతో బయటకు వచ్చింది . పక్కన వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు..

ఇంతలోనే మరో ట్విస్ట్

ఇది ఇలా ఉంటే దుర్గానగర్‌ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో హమీద్‌ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు . స్థానికంగా విషయం తెలుసుకున్న కొందరు అతన్ని ఆసుపత్రికి తరలించారు . కానీ అతను మార్గమధ్యంలో చనిపోయాడు. దీనితో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలని తెలుసుకొని కేసు నమోదు చేసారు, గీతా హత్య, హమీద్ ఆత్మహత్య వలన వీరి ఇరువురు కుటుంబానికి చెందినా పిల్లలు అనాధలుగా ఉన్నారు.