పబ్లు , హోటళ్లు , రిసార్ట్ లకు భజరంగ్ దళ్ బహిరంగ లేఖ

వాలెంటైన్ డే పేరుతో ఫిబ్రవరి 14న ప్రేమ జంటలు బయట తిరగరాదని భజరంగ్ దళ్ నేతలు పేర్కొన్నారు . మంగళవారం కోఠి లోని విహెచ్ పీ రాష్ట్ర కార్యాలయంలో భజరం గ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ , నాయకులు శివరాములు , ముఖేశ్ , జగదీశ్వర్ కుమార్ మాట్లాడుతూ ,వాలెంటైన్ డే సందర్భంగా పబ్లు , మాల్స్ , హోటల్స్ , రెస్టారెంట్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించ రాదన్నారు . ప్రేమ జంటలు బహిరంగంగా కనిపిస్తే పట్టుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు వాలెంటైన్ డే నిర్వహించే పబ్లు , రిసార్టుల , హో టళ్లు , మాల్స్ఫై దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు .

దిష్టిబొమ్మల దహనాలు , వాలెంటైన్ డేకు నిరసనగా ఫిబ్రవరి 14న రాష్ట్రం లోని ప్రధాన కూడళ్లలో వాలెంటైన్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుభాష్ చందర్ తెలిపారు . అలాగే వాలెంటైన్ డే ను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు .