ఆమెకు పెళ్లైంది. కాని.. కొన్ని విబేధాల కారణంగా భర్తకు దూరంగా ఉంటుంది. తల్లిదండ్రుల వద్ద తలదాచుకుంటుంది. అయితే వాళ్లింటి దగ్గర్లోనే ఉన్న ఇద్దరు నీఛులు ఆ యువతిపై కన్నేశారు. ఆ అమ్మాయిని ఎలా అయినా లొంగదీసుకోవాలని పన్నాగం పన్నారు. అమ్మాయిని విందు పేరుతో వేరే వారి ఇంటికి పిలిచేందుక ప్లాన్ వేశారు. దీనికి మరో అమ్మాయి సహాయం కూడా తీసుకున్నారు. పాపం ఇవేమి తెలియని బాధితురాలి గుడ్డిగా నమ్మి విందుకు వెళ్లింది. ఇంతలో ఆమె బట్టలపై ఉద్దేశపూర్వకంగానే జ్యూస్ పడేశారు. అయ్యో, సారీ సారీ అంటూనే నంగనాచి కబుర్లు చెప్పారు. బట్టలు పాడైపోయాయిగా మార్చుకోవాలంటూ బలవంతం చేశారు. వేరే గదిలోకి వెళ్లమని చెప్పారు. బట్టలపై జ్యూస్ పడి పాడైపోవడంతో అమ్మాయి కూడా మార్చేసుకుంటే ఓ పనై పోతుంది కదా అని గదిలోకి వెళ్లింది.
అప్పటికే అక్కడి నక్కి ఉన్న దుర్మార్గులు, ఆ అమ్మాయి దుస్తులు మార్చుకుంటుంటే ఫోటోలు వీడియోలు తీశారు. ఆపై వాటిని ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిందీ ఘటన. సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ వివాహిత భర్తతో విభేదాల కారణంగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. విషయం తెలిసిన ఇద్దరు యువకులు ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఆమె ఇంటి పక్కనే ఉండే మరో యువతి ద్వారా తమ ప్లాన్‌ను అమలు చేశారు. బాధితురాలి పక్కింటివారు ఏదో ఫంక్షన్ చేస్తున్నారని తెలిసిన నిందితులు తమ ప్లాన్‌ను అమలు చేశారు. విందుకు ఆమె కూడా వచ్చేలా చేశారు. అయిష్టంగానే విందుకు వచ్చిన బాధిత యువతి భోజనం పూర్తి చేసింది.
అప్పటికే ఆ అమ్మాయిని ట్రాప్ చేసేందుకు పక్కా ప్లాన్ వేసిన ఆ ఇద్దరు యువకులు ఆమె చుట్టూనే తిరుగుతూ కావాలని ఆమె దుస్తులపై జ్యూస్ వేశారు.
దుస్తులు మార్చుకోవాలంటూ ఓ గదిలోకి పంపించారు. అక్కడ ఆమె దుస్తులు మార్చుకుంటుంటే రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. మంగళవారం సాయంత్రం బాధితురాలి సోదరుడికి నిందితులు ఆమె నగ్న చిత్రాలను పంపించారు. వీటిని చూసిన ఆమె షాక్‌కు గురైంది. ఆ వెంటనే సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన నిందితులు సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. పోలీసులకు చిక్కకుండా పరారవ్వడంతో, ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు.