సామాజిక మాధ్యమాల వెల్లువలో సెలబ్రిటీల ప్రచారం సులువు అయిపోయింది . రెగ్యులర్ ఫోటో షూట్లను నిరంతరం అభిమానులకు షేర్ చేస్తూ వేడి పెంచుతున్నారు . ఇందుకు చందమామ మినహాయింపేమీ కాదు . ఇతర భామల్లానే కాజల్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు . రెగ్యులర్ బేసిస్ లో అభిమానులకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు . కాజల్ ఇన్ స్టాగ్రమ్ రెగ్యులర్ ఫోటోషూట్లతో హీటెక్కిపోతోంది . తాజాగా మరో ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది . ఈ ఫ్లోరల్ లుక్ అద్భుతం అంటూ కితాబిచ్చేస్తున్నారు ఫ్యాన్స్ .
ప్రస్తుతం కాజల్ ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . శర్వానంద్ – కాజల్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది . ఈ సినిమాతో పాటు ‘ భారతీయుడు 2 ‘ లాంటి భారీ చిత్రంలోనూ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే . ఆ సినిమా కోసం కళరియపట్టు అనే విద్యలో కాజల్ శిక్షణ పొందిందని వార్తలు వచ్చాయి శర్వాతో కలిసి స్పెయిన్ లో షూటింగ్ లో పాల్గొంటోంది . ఆ సినిమా సెట్స్ లో ఉండగానే ఇదిగో ఇలా అందరికీ టచ్ లోకి వచ్చింది . పువ్వు వికసిస్తే ఆ అందమే వేరు . అంతందంగా వికసిస్తున్న కాజల్ యువతరంలో అగ్గి రాజేస్తోంది . .
ఓవైపు నవతరం హీరోలు, మరోవైపు సీనియర్ హీరోలతో కాజల్ తెలివిగా కెరీర్ ని ప్లాన్ చేస్తున్న సంగతి ప్రశంసించాల్సిందే . ఇదీ వరకూ మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరో సరసన నటించిన కాజల్ అటుపై రానా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో నటించింది . ఇప్పుడు మరో అగ్ర హీరో కమల్ హాసన్ సరసన నటిస్తూనే . . యువ హీరో శర్వానంద్ సరసన నటిస్తోంది . ఈ డ్యూయల్ గేమ్ ప్లాన్ బావుందని ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్ .