మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ అనే యువకుడిపై అమృత ఫిర్యాదు చేశారు. తమ కదలికల సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం కుమారుడికి చేరవేస్తున్నాడనే అనుమానంతో ఆమె ఫిర్యాదు చేశారు. అమృత ఇంటి ఎదురుగా ఉంటున్న విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇటీవలే అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. తన కుమార్తె అమృత వేరే సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంగా మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన మారుతీరావు చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు పోలీసుల భద్రత మధ్య అమృత ఆమె తల్లిని కలుసుకున్నారు.