తమిళనాడులో ఓ గవర్నమెంట్‌ టీచర్‌ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడమే కాదు, ఆ చెండాలాన్ని వీడియో తీసి వైరల్‌ చేసిన ఘటన పెనుదుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తోంది సదరు టీచర్‌(42). ఈ క్రమంలో ఓరోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి రప్పించుకుని వాళ్లతో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త ఒకడు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సాయంతో వాట్సాప్‌ ద్వారా సర్క్యూలేట్‌ చేశాడు. వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డీజీపీ కార్యాలయం స్పందించింది.

తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని మధురై సైబర్‌ సెల్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్‌, ఆమె ప్రియుడ్ని మధురై పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్‌ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే అశ్లీల సైట్లలో అప్‌లోడ్‌ చేసి డబ్బు సంపాదించాలనుకున్నారా? బ్లాక్‌మెయిలింగ్‌ కోణం ఉందా? అనేది సైబర్‌విభాగం తేల్చాల్సి ఉంది. వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్‌పై, ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.