నగరంలోని పోచమ్మమైదాన్‌కు చెందిన తాండ్ర భాస్కర్‌, దేవమ్మల కుమారుడు తాండ్ర నవీన్‌ (20), ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన మరో విద్యార్థి మచ్చల సుధీర్‌ కాజీపేట మండలం రాంపూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా చదువుతున్నారు. ఇద్దరు బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా మడికొండలోని మెట్టుగుట్ట ద్వారం సమీపంలో ముందు వెళ్తున్న మునిసిపల్‌ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో నవీన్‌ తలకు తీవ్ర గాయాలు కాగా, సుధీర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
వీరిని పోలీసులు MGM ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నవీన్‌ మృతి చెందాడు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్నవాల్లు చేబుతున్నరు. మృతుడి తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్‌, బైక్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.