విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు కార్యాచరణ- NPDCL “CMD” ఆన్నమనేని గోపాల్రావు.

విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆన్నమనేని గోపాల్రావు గారు అధికారులను ఆదేశించారు. హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీసేవలో దరఖాస్తు చేసుకున్న కొత్త కనెక్షన్లకు మీటర్లను ఇవ్వాలని, జియో, ఇండస్ సెల్ ఫోన్ టవర్లకు ప్రాధాన్యతతో సర్వీసులను వెంటనే మంజూరు చేయాలన్నారు. డీఎన్ఆర్ పనులలో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని విద్యుత్ సర్వీస్లు లేని గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏజీ ఆండ్ సీ నష్టాలను వీలైనంత వరకు తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు పర్చాలన్నారు.

డీడీ యూజీజై వైలో సర్వీసుల ముంజూరును అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేయాలని అన్నారు. హన్మకొండ, వరంగల్ టౌన్ లో స్కాడా రిపోర్టు ఆధారంగా ఆంతరాయాలను సమీక్షిస్తూ వీలైనంత వరకు తగ్గించాలని గోపాల్రావు పేర్కొన్నారు. కస్టమర్ కేర్ సెంటర్లో వచ్చే సమస్యల ఫోన్ కాల్స్, పరిష్కారమవుతున్న తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు.