విధినిర్వహణలో చక్కగా రాణిస్తునే ప్రజల్లో పోలీసులకు కీర్తి ప్రతిష్టలు తీసువచ్చే అధికారులు, సిబ్బందికి శాఖపరమైన రివార్డులు వుంటాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల పరితీరును మరింత మెరుగుపర్చడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకుగాను రాష్ట్ర పోలీస్‌ DGP రూపోందించిన 17 వర్టికల్స్‌ విధానాన్ని ప్రస్తుతం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అమలు పర్చడం జరుగుతోంది. ఈ 17 వర్టికల్స్‌ను అనుసరించి పోలీస్‌ స్టేషన్‌ నందు నిర్వహించే విధులును 17విభాగాలుగా విభజించి ఒక్కోక్క విభాగానికి ఎస్‌.ఐ స్థాయి నుండి కానిస్టేబుల్‌ స్థాయి పోలీస్‌ అధికారులను భాధ్యులను చేయడం జరుగుతుంది.

ఈ విధంగా వర్టికల్స్‌ విధానంలో విభాగాల వారిగా చక్కగా రాణిస్తూ తమ ప్రతిభను కనబరిచిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా రివార్డులను అందజేయడం జరిగింది. వర్టికల్స్‌ విధానంలో ప్రతిభ కనబరిచి రివార్డులు అందుకున్నవారిలో ఇన్స్‌స్పెక్టర్లు సంతోష్‌, మధు, SI లు రవీందర్‌, మహెందర్‌, భాస్కర్‌ రెడ్డి, రమేష్‌, ASI లు యాదగిరి, సంపత్‌కుమార్‌, సాంబమూర్తి, మహెందర్‌ రావు, హెడ్‌ కానిస్టేబుళ్ళు ప్రభాకర్‌, దేవా, యాకయ్య, కానిస్టేబుళ్ళు నరేష్‌, నవీన్‌కుమార్‌, ధనుంజయ్‌, రమేష్‌, జంపయ్య, సురేష్‌, వెంకటి, గట్టయ్య, రాజ్‌కుమార్‌, సృజన్‌, సంతోష్‌, యుగేందర్‌, రమేష్‌, సంతోష్‌, వెంకట్‌, మహిళా కానిస్టేబుళ్ళు శిరీషా, నీలిమా,నీరజ మరియు హోంగార్డ్స్‌ శ్రీధర్‌, రమేష్‌ వున్నారు.

ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ అధికారులు అప్పగించిన విధుల్లో చక్కగా నిర్వర్తించడం అధికారుల మన్ననలతో పాటు, ప్రజలు గుర్తిస్తారని, ప్రతి ఒక్కరూ ప్రణాళికబద్దంగా విధులు నిర్వహించడం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమములో సెంట్రల్‌, వెస్ట్‌జోన్‌ డి.సి.పి బి.వెంకట్‌ రెడ్డి, బి. శ్రీనివాస రెడ్డితో పాటు, అదనపు డి.సి.పి బిల్లా అశోక్‌కుమార్‌ పాల్గోన్నారు.