దుబాయ్ నుంచి లక్నోకు శనివారం ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. IX-194 సర్వీస్ విమానంలో మొత్తం 150 మంది ప్రయాణీకులు ఉన్నారు. గమ్యస్థానానికి బయలుదేరిన విమానంలోని ప్రయాణికులు ఉన్నట్టుండి షాక్ కు గురయ్యారు.

ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి నగ్నంగా విమానంలో అటు ఇటు తిరగడం ప్రారంభించారు. అతడి చేష్టలతో విమాన సిబ్బంది కూడా ఖంగుతిన్నారు. వెంటనే విమాన సిబ్బంది అతడిని పట్టుకుని సీటులో కూర్చోబెట్టి, వంటిపై బ్లాంకెట్ కప్పారు. లక్నో చేరుకున్న వెంటనే అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు.