వివాహితపై యువకుడి అత్యాచారయత్నం ….

ఓ వివాహితపై యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన జనగామ జిల్లా, జఫర్గడ్ మండలం, కేజీ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన వివాహిత శనివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా భూక్య తిరుపతి అనే యువకుడు ఆమె చేయి పట్టుకుని చెట్ల ప్రజల్లోకి తీసుకెళ్లాడు.

అత్యాచారం చేసేందుకు యత్నించగా మహిళా కేకలు వేసింది. సమీపంలో ఉన్న ఆమె కుమారుడు రావడంతో తిరుపతి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.