వివాహేతర సంబంధాన్ని పట్టించిన FACEBOOK
యువతి చనిపోయినట్లుగా నమ్మించి కట్టుకున్నవాడిని, కన్నవారిని కూడా మోసం చేయటమే కాకుండా పోలీసు వ్యవస్థను కూడా పక్కదారి పట్టించింది.
ఉత్తరప్రదేశ్‌లో చనిపోయినట్లు డ్రామా ఆడిన ఓ మహిళ తన మాజీ ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయింది. రాహుల్ అనే యువకునికి రూబీ అనే యువతితో 2016లో వివాహం జరిగింది. కొంతకాలం సజావుగానే వున్న రూబీ ఒక్కసారిగా కనిపించకుండాపోయింది. దీంతో అల్లుడిని అనుమానించిన రూబీ తండ్రి తన కుమార్తె భర్త హింసించి చంపేశాడని..కనీసం శవం కూడా కనిపించకుండా మాయం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై రూబీ ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో విచిత్రమైన వాస్తవాలు బైటపడ్డాయి. ఈ వాస్తవాలతో పోలీసులు సైతం విస్తుపోయారు.
రూబీ మృతదేహాన్ని వెతకినా లభించకపోవటం..కానీ రూబీ ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రం యాక్టివ్‌లో వుంది. దీంతో దిమ్మతిరిగిపోయిన పోలీసులు వారి స్టైల్ లో రూబీ ఫేస్‌బుక్ ఆధారంగా ఆమె మొబైల్ ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్నారు. ఫోన్ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో రూబీ మరణించలేదని..బ్రతికేవుందనీ తెలుసుకున్నారు. అంతేకాదు రూబీ వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రూబీ, ఆమె ప్రేమికుడు, ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో విస్తుపోవటం రూబీ తల్లిదండ్రుల వంతైంది.