గార్ల మండలంలో కొత్తగా ఏర్పడిన రాజతండా పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు ఎన్నిక ఆశ్చర్యపరిచింది. ఈ వార్డులో కాంగ్రెస్‌ మద్దతుతో బానోతు భాస్కర్‌ పోటీలో నిలిచారు. ఈయన ప్రత్యర్థిగా తెరాస మద్దతుదారు బి.శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. ఆదివారం అనారోగ్యంతో భాస్కర్‌ ఆకస్మికంగా మరణించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన బానోత్ భాస్కర్ చిన్నతనం నుండి విద్యపై మక్కువ పెంచుకొని ఎంటెక్ వరకు చదివి ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో తాత్కాలిక ఉద్యోగం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ప్రతి ఒక్కరితో సోదరభావంతో కలిసిమెలిసి ఉంటున్న భాస్కర్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజుతండా 3వార్డునుండి నామనేషన్ ధాఖలు చేయడం జరిగింది.

ఇంతలో తీవ్ర జ్వరంతో పాటు శ్వాసకోస వ్యాధి రావండతో మూడు రోజలు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు .
రాజుతండా పంచాయతీలోని 3 వార్డులో టిఆర్‌ఎస్ బలపర్చిన బానోత్ శ్రీనివాస్ కాంగ్రెస్ బలపర్చిన భాస్కర్ ఇరువురు చనిపోక ముందు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం జరిగింది. 60 ఓట్లు కలిగిన వార్డులో చనిపోయిన భాస్కర్‌కు 40ఓట్లు రాగా ప్రత్యర్ధి బానోత్ శ్రీనివాస్‌కు 20ఓట్లు రాగా బాస్కర్‌కు 20మెజార్టీ రావడం జరిగింది. సానుభూతి తో తన కొడుకును గెలిపిచిన ఓటర్లకు బాస్కర్ తల్లిదంద్రులు, భార్య ధన్యవాదాలు తెలపడం జరిగింది.