ఉగ్రదాడిని యావత్ దేశం తీవ్రంగా ఖండించింది. యావత్ ప్రజానీకం కంటతడి పెట్టింది. అమర జవాన్ల త్యాగం మరువం అంటోంది. తీవ్రవాదుల అంతు చూడాలని శపథం చేసింది. దొంగ దెబ్బ తీసిన ముష్కరులను నామరూపాలు లేకుండా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం అందరి రక్తం మరుగుతోంది. దేశం మొత్తం ఉగ్రదాడిపై ఆగ్రహంతో ఉంది.
కానీ ఓ విద్యార్థి మాత్రం ఉగ్రదాడిని సమర్థించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన బాసిమ్ హిలాల్ అనే విద్యార్థి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దుశ్చర్యను సమర్థించాడు. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్ అంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్ తీవ్ర వివాదంగా మారింది. అది చూసిన యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే యాక్షన్ తీసుకుంది. ఆ విద్యార్థిని సస్పెండ్ చేసింది. జమ్మూకు చెందిన బాసిమ్ యూనివర్సీటిలో BSC మేథమేటిక్స్ చదుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా బాసిమ్‌కు కొందరు సహచర విద్యార్థులు అండగా నిలిచారు. అతడు చేసిన ట్వీట్‌లో తప్పేముందని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
పుల్వామాలో CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు వీర మరణం పొందారు. శ్రీనగర్ లో విధుల్లో చేరేందుకు జవాన్లు వెళ్తున్నారు. 70 వాహనాల్లో 2వేల 500 మంది జవాన్లను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీశారు. అదను చూసి కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 40మంది జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు…