ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలల చిన్నారి సాత్విక వీధి కుక్కలకు బలిఅయ్యిందిఈ ఘటనతో శ్రీకాకుళం జి.సిగడాం మండలం మెట్టవలసలో తీవ్ర విషాదం నెలకొందివీధిలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేశాయి నాలుగు వీధి కుక్కలు ఈ ఘటనలు చిన్నారి తీవ్రంగా గాయపడింది ఇక, కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే చికిత్స కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు అయితే, ఆ చిన్నారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాత్విక కన్నుమూసింది పసిపాప మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు కుక్కల నియంత్రణపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు..