హైదరాబాద్ మెట్రో రైల్వే అధికారులు తలపట్టుకుంటున్నారు, వృద్ధులు, పిల్లలు, రోగులు వంటి నిస్సహాయుల కోసం మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన లిఫ్టులను కొంతమంది టీనేజ్ యువతీ యువకులు పచ్చి-కామక్రీడలకు అడ్డగా మార్చేస్తున్నారు. లిఫ్టుల్లో ఇక్కడ రాయడానికి, చూపడానికి వీల్లేని అశ్లీల తతంగాలకు పాల్పడుతున్నారు.

అబ్బాయిలకంటే అమ్మాయిలే చొరవ తీసుకుంటున్నారు. అబ్బాయిలను చొక్కాలు, ప్యాంట్లు పట్టుకుని దగ్గరికి గుంజుకుని మరీ ముద్దుపెట్టడం, వాటేసుకోవడం, చివరకు, ఇక్కడ చెప్పడానికి అడ్డొచ్చే నానా పనులూ చేస్తున్నారు. హైటెక్ యుగంలో అడుగడుగునా కెమెరాలు ఉంటాయన్న సోయి లేకుండా గలీజ్ గలీజ్ పనులకు తెగబడుతున్నారు. వారి కామకలాపాలు సీసీకెమెరాల్లో రికార్డయి వీడియోలు మీడియాకు చిక్కాయి. వారి వ్యక్తిగత గోప్యతను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం ఆ వీడియోలను అందించడం లేదు. చదువుకోవాల్సిన వయసులో పిల్లలు ఇలాంటి పనులకు, అందులోనూ బహిరంగ ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించడం ఆందోళనకరం. మంచి భవిష్యత్తు ఉన్న టీనేజ్ పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని కోరుకుందాం…