వెంకటేష్‌ ఇంట్లో పెళ్లిసందడి

టాలీవుడ్ నటుడు వెంకటేష్‌ ఇంట్లో త్వరలో పెళ్లిసందడి మొదలుకానుంది. ఆయన కూతురు అశ్రితకి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఇప్పటికే దగ్గుబాటి-వరుడు ఫ్యామిలీ మధ్య మాటలు నడుస్తున్నాయి. ఇంతకీ వెంకటేష్‌కి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా? హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు.

మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫ్రెండ్ రఘురామిరెడ్డి కొడుకు. ఇటీవలే వెంకటేష్ సోదరుడు ప్రొడ్యూసర్ సురేష్‌బాబు. సురేందర్ ఇంటికెళ్లి వివాహానికి సంబంధించి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన వెంకటేష్, తిరిగి హైదరాబాద్‌కి రాగానే అశ్రిత ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. అశ్రిత బేకరి రంగంలో ట్రైనింగ్ తీసుకుంది. ‘ఇన్‌ఫినిటీ ప్లేటర్’ పేరుతో సిటీలో పలు స్టాల్స్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

రామానాయుడు స్టూడియోలో ఈ తరహా స్టాల్ ఒకటి వుంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరగనుంది.