పరకాల : భర్త నుంచి విడాకులు తీసుకున్న తనకు తోడుంటానని వెంటాడి ప్రేమించి పెళ్లి చేసుకొని . కూతురు పుట్టాక మరోపెళ్లికి సిద్ధపడుతున్నాడంటూ ఓ మహిళ ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

పూర్తీ వివరాలు: పరకాల పటణంలోని మలారెడ్డిపలె కాలనీకి చెందిన రాయబారప నితీష్ సికింద్రాబాద్ లో ప్రైవేటు కన్సల్టెంట్ గ పనిచేస్తున్నాడు . ఈ సమయంలో ప్రైవేటు కళాశాలలో ఆపరేటర్ గ పనిచేస్తూ కుటుంబ గొడవలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన హసీనాతో పరిచయం ఏర్పడింది . అప్పటి నుంచి తనకు తన వెంటపడుతుండగా మొదట నిరాకరించిన హసీనా నాలుగేళ్ల క్రితం ఒప్పు కుంది . పిల్లలు వద్దంటూ పుట్టిన కూతు రును విక్రయించే ప్రయత్నం నితీష్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి . 2018 నవంబర్ 23న హసీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత కోపం పెంచుకున్నాడు . తల్లిదండ్రుల ఒత్తిడితో మరో పెళ్లికి సిద్దపడుతూ తనకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటూ శనివారం మధ్యాహ్నం నితీష్ ఇంటి ఎదుట బైఠాయించింది . బాధితురాలి ఆందోళనపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు . దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చట్టపరంగా వెళితే న్యాయం జరుగుతుంది తప్పా ఆందోళనతో సమస్య పరిష్కారం కాదంటూ నచ్చ జెప్పి పంపారు. తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని బాధితురాలు హసీనా తెలిపింది. యువకుడి తల్లిదండ్రులు రూ . 2లక్షల ఇస్తాం తమ కొడుకు నుంచి దూరంగా ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది . పెళ్లి చేసుకున్న ఆధారాలను మాయం చేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారు అని. నితీషతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించింది .