హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి ( 20 ) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది . 70 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది హన్మకొండ PS లో పనిచేస్తున్న ఓ ఎస్ఐ స్థాయి అధికారి తో పాటు మరికొంత మంది సిబ్బంది అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు . వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్న రవళి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిసింది. స్నేహితులు , కళాశాల యాజమాన్యం రవళిని చూసేందుకు సికింద్రాబాద్ కు తరలివెళ్లారు . అక్కడ ఆమె పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరయ్యారు . కాగా రవళికి ముందుగా ఎంజీఎంలో చికిత్స చేసే ప్రయత్నం చేసినా ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో రాజధానికి తరలించినట్టు తెలుస్తోంది . మరోవైపు దాడికి పాల్పడిన పెండ్యాల సాయిఅన్వేశ్ను హన్మకొండ పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు . ఘటనకు పాల్పడిన వెంటనే అన్వేశ్ మామునూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు విషయం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు . అన్వేశ్ పై ఐపీసీ 341 354బీ , 326ఏ , 307 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు హన్మకొండ సీఐ సంపత్ రావు చెప్పారు…