వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు

వేయిస్తంభాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆశ్వయుజ శుద్ధనవమి, సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేసారు. గణపతి ఆరాధన, రుద్రునికి రుద్రాభిషేకం, అమ్మవారి మండపంలో ఉత్సవమూర్తులకు హరిద్రాచూర్ణ కుంకుమ విలేపన గంధోదక నారికేళ జలాభిషేకం నిర్వహించారు. చతుషష్టి ఉపచారాలతో పూజలు చేశారు. యాగశాలలో మహాచండీ యాగం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. గురువారం విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధపూజ, కలశపూజ,

సాయంకాలం అమ్మవారి ఊరేగింపు ఉంటుందని ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ప్రకటనలో తెలిపారు.