NPDCL విద్యుత్ భవన్ , కార్పోరేట్ కార్యాలయములో భూపాలపల్లి , మహబూబాబాద్ , వరంగల్ రూరల్ , జనగాం సర్కిళ్ళ ఎస్ఈలు , డీఈలు , ఏడీఈలు , ఏఈలు , ఎస్ఏఓలు , ఏఓలు , ఏఏఓలతో ,CMD శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు . ఈ సమీక్షా సమావేశం లో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు మాట్లాడుతూ గృహ వినియోగదారుల విద్యుత్ బకాయిలు టార్గెట్ పెట్టుకొని వసూళ్లు చేయాలని ఆదేశించారు . డిమాండ్ 100 % వచ్చేటట్లు చూడాలన్నారు . రెవెన్యూ కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయని ఈ నెలాఖరు వరకు పెంచాలని అన్నారు . డిపార్టమెంటల్ ఎస్పిఎం షెడ్లలో మరమ్మత్తులు చేసేటట్లు చొరవ తీసుకోవాలని కోరారు . పనిచేయని, సమస్యలు ఉన్న కాలిపోయిన మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను మార్చే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు . వర్క్ ఆర్డర్స్ పెండింగ్ లేకుండా చూడాలన్నారు . మీటర్లు అమర్చని సర్వీసులకు వెంటనే అమర్చాలని అన్నారు .

ప్రతి ఒక్క ఏఈ , ఏడీఈ , డీఈలు హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు అప్పుడే వినియోగదారులకు మరింత మెరుగైన , నాణ్యమైన అంతరాయాలు లేని విద్యుత్ అందించడానికి దోహదపడుతుందని అన్నారు . వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు త్వరితగతిన మంజూరు చేయాలని అన్నారు. వర్షకాలంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని అన్నారు. కెపాసిటర్ బ్యాంక్లను వినియోగంలోకి తీసుకురావలని అన్నారు . టిఎస్ఐపాస్ అప్లికేషన్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలన్నారు . ఆర్థికంగా సంస్థ బలోపేతం కావాలంటే అన్ని విభాగాలు సమర్ధవంతంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పని చేయాలని అన్నారు . |

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్ ) శ్రీ డి . నర్సింగ రావు , డైరెక్టర్ (కమర్షియల్ ) శ్రీమతి సంధ్యా రాణి , డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ పి . మోహన్రెడ్డి గార్లు , CGMలు వి . మోహన్ రావు , కె . కిషన్ గార్లు , GMలు సత్యనారాయణ గారు , ఎస్ఈలు రాజు చౌహాన్ , నరేష్ , KN. గుట్ట , మల్లిఖార్జున్ గార్లు, డీఈలు సామ్యా నాయక్ , శ్రీధరాచారి , ఉపేందర్ , మల్లిఖార్జున్ , దర్శన్ కుమార్ , సదానందం , నవీన్ , మల్సూర్ , అనిల్ కుమార్ , అమర్ నాథ్ గార్లు ఎస్ఏఓలు వెంకటకృష్ణ , నర్సింగరావు , సంతోష్ గార్లు , ఏడీఈలు ఏఈలు తదితరులు పాల్గొన్నారు .