హైదరాబాద్‌ షామిర్‌పేట్‌లో కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ . ఉదయం రాజా సింగ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక కంటైనర్ లో అక్రమంగా గోవులను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఆయన అనుచరులతో కలిసి ఘటనస్థలికి చేరుకున్నారు.

వాహనం పైకి ఎక్కి ఆవులను చూసిన ఆయన లారీ డ్రైవర్, క్లీనర్ ను వాటిని ఎక్కడినుండి ఎక్కడి కి తీసుకెళుతున్నారంటూ ప్రశ్నించారు. వారు నుండి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని షామిర్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వ్యాను ప్రస్తుతం శామిర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఆవులను చంపడం హిందువుల ధర్మం కాదని.. వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజాసింగ్ అన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు.