హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై హత్యాచార ఘటన మరువక ముందే అలాంటి ఘాతుకం వెలుగుచూసింది. సిద్దులగుట్ట రోడ్డులో ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు మృతదేహంపై కిరోసిన్‌ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు…

48 గంటల్లోపే అదే శంషాబాద్ లో మరో మహిళను తగుల బెట్టారు:

ప్రియాంకరెడ్డిని దుండుగులు తగుల బెట్టిన 48 గంటల్లోపే అదే శంషాబాద్ లో మరో మహిళను తగుల బెట్టారు. బాధితురాలు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. వెంటనే మరో ఘటన జరగడంతో ప్రజల్లో భయం పెరిగింది. పోలీసులకు వణుకు పుట్టింది. సిద్ధలగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకవైపు పోలీసులు ప్రియాంక కేసులో 4 గురు నిందితులను అరెస్టు చేసినా నేరస్థులు భయపడటం లేదు. అదే ప్రాంతంలో మరో ఘోరమైన ఘటన జరగడం తెలంగాణలో శాంతి భద్రతలపై మచ్చ పడింది.

కొద్దినెలలుగా తెలంగాణ లో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. దానికి తోడు రోడ్డు ప్రమాదాలు ఘోరంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళలే వీటిలో బాధితులు ఎక్కువగా ఉండటం శోచనీయమైన విషయం. కేవలం వారం రోజుల్లో రోడ్డు ప్రమాదంలో నడి వయసు యువతులు పది మంది కేవలం సిటీలో రోడ్డు ప్రమాదాల్లో మరణించగా టీసీఎస్ ఉద్యోగి సోహినీ సక్సేనా ప్రమాదం వైరల్ అయ్యింది. ఇక ప్రియాంక రెడ్డిని నలుగురు గ్యాంగ్ రేప్ రాత్రికిరాత్రే తగులబెట్టారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో వేగంగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈమె మరణానికి పోలీసులు వెంటనే రియాక్ట్ కాకపోవడమే కారణం అని తెలియడంతో పోలీసు వ్యవస్థ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. హోంమంత్రి మహమూద్ అలీ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయి. దీనిపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ప్రజల ప్రాణాలను కేసీఆర్ ఎంఐఎంకు తాకట్టు పెట్టారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ రాజకీయం పక్కన పెడితే వెంటవెంటనే ఇద్దరు మహిళలు హైదరాబాదు శివార్లలో మానవ మృగాల చేతిలో దారుణంగా సజీవ దహనం కావడం ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది…